Share News

గంజాయి రహిత జిల్లాగా మారుస్తాం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:25 PM

నంద్యాలను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని నెలలుగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.

 గంజాయి రహిత జిల్లాగా మారుస్తాం
సిబ్బంది సమస్యలు వింటున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల టౌన్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): నంద్యాలను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని నెలలుగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. పాత నేరస్తులు, అనుమాన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలల్లో 8 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి సుమారుగా 23.193 కేజీల గంజాయిని సీజ్‌ చేశామన్నారు. గంజాయి విక్రయాలు చేస్తే వారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసు సంక్షేమ దివస్‌ను నిర్వహించారు. జిల్లాలోని పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డులు నేరుగా జిల్లా ఎస్పీకి వారి సమస్యలను వివరించారు. ఎస్బీ సీఐ గుప్తా, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:25 PM