రైతును రాజుగా చేస్తాం
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:11 AM
రైతును రాజుగా చేసేందుకే పనిచేస్తున్నామని, వారు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
రుద్రవరం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రైతును రాజుగా చేసేందుకే పనిచేస్తున్నామని, వారు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మంగ ళవారం సాయంత్రం మండలంలోని ముత్తలూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నవధాన్యాల విత్తనం వేశారు. భూమా కుటుంబం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రైతు పక్షపాత కుటుంబమన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. తెలుగుగంగ కేసీ కెనాల్, కాల్వలు, ఉప కాల్వలు, డిస్ర్టిబ్యూటరీ ఛానళ్లపై అసెంబ్లీలో చరిచ్చంనానన్నారు. గత ప్రభుత్వం సబ్సిడీ, గిట్టుబాటు ధర కల్పించలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ కన్వీనరు ఎల్‌వీ రంగనాయకులు, ఆలమూరి నారాయణ, సాగర సంఘం ఛైర్మన్ శ్రీలత, సంజీవరాయుడు, పత్తి బ్రహ్మయ్య లక్ష్మినారాయణ, పార్ధసారధిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఫక్కీరయ్యగౌడ్, శ్రీనివాసులు, కుమ్మరి వెంకటపతి, చంద్ర, ఏవో సుమతి తదితరులున్నారు.
సీఎం రిలీ్‌ఫ ఫండ్ పంపిణీ
ఆలమూరుకు చెందిన బాధితుడు శ్రీనివాసులుకు రూ.2.53,553 సీఎం రిలీఫ్ ఫండ్ చుక్కును ఎమ్మెల్యే అందించారు. ఆరోగ్యఖర్చుల సాయం చేస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందేలా కృషిచేస్తానన్నారు. పత్తి బాచుపల్లె వెంకటరమణ పాల్గొన్నారు.