Share News

విచారించి న్యాయం చేస్తాం

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:12 PM

ప్ర జా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి న ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

విచారించి న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ప్ర జా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి న ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 109 ఫిర్యాదులు వచ్చాయి. డీఎస్పీ రాఘవేంద్ర సీఐలు మస్తాన్‌ వలి, రామకృష్ణ పాల్గొన్నారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు

కరీంనగర్‌కు చెందిన సూర్య రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.11.10 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలం ముజఫర్‌ నగర్‌కు చెందిన చిరంజీవి, రాజు ఫిర్యాదు చేశారు. మూడున్నర ఎకరాల పొలాన్ని కొప్పు వెంకటేశ్‌, కొప్పు రాగన్నలు ఆక్రమించుకున్నారని మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన తాయన్న ఫిర్యాదు చేశారు. ఏపీ ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ పొలాల్లో 400 కేవీ విద్యుత్‌లైన్‌ ఏర్పాటు చేసి రూ.35లక్షలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి రూ.10లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.25 లక్షలు ఇవ్వలేదని తుగ్గలి మండలం రోళ్లపాడు తండాకు చెందిన నాగేంద్ర నాయక్‌, సురేష్‌ నాయక్‌, డాకే నాయక్‌, రాజు నాయక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇప్పిస్తామని 16 మంది రైతుల నుంచి రూ.20.46 లక్షలు తీసుకుని మోసం చేశారని హొళగుంద మండలం నెరణికి చెందిన నాగరాజు, ఇతర రైతులు ఫిర్యాదు చేశారు. కర్నూలు వార్త ఆఫీసు సమీపంలో స్థలం విషయంలో కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇచ్చిన డబ్బులు, బంగారం తిరిగి ఇప్పించాలని కర్నూలు షరా్‌ఫబజార్‌కు చెందిన వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. కోర్డు ఆర్డర్‌ కాపీ ఉన్న స్థల విషయంలో న్యాయం జరగడం లేదని, న్యాయం చేయాలని కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన అంజన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 17 , 2026 | 11:12 PM