విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - May 18 , 2026 | 11:35 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పోలీసు శాఖకు 128 ఫిర్యాదులు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 128 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్‌పీరా, సీఐలు రామాంజులు, రామయ్య నాయుడు, పార్థసారధి, రామకృష్ణ పాల్గొన్నారు.