Share News

విచారించి న్యాయం చేస్తాం

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:04 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ విచారించి చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

విచారించి న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్నఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 101 ఫిర్యాదులు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ విచారించి చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేట టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన 101 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులకు త్వరి తగతిన న్యాయం చేస్తామని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ హుస్సేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:04 AM