Share News

పోరాటాలను ఉధృతం చేస్తాం

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:30 PM

ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సిం గరావ్‌ అన్నారు.

పోరాటాలను ఉధృతం చేస్తాం
మాట్లాడుతున్న నర్సింగరావ్‌

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావ్‌

ముగిసిన రాష్ట్ర మహాసభ

నంద్యాల రూరల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సిం గరావ్‌ అన్నారు. ఆదివారం సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్బంగా కోఆపరేటివ్‌ కమ్యూనిటీ హల్‌లో ఆయన మాట్లాడుతూ 17వ రాష్ట్ర మహాసభలో కార్మికుల సమస్యల గురించి జరిపిన చర్చ కార్యక్రమంలో 80 ప్రముఖుల అభిప్రా యాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. వేల కోట్ల రూపాయలు లాభాలను పొందుతున్న పరిశ్రమల్లో కూడా ఇంత వరకు ఐదు రూపాయల వేతనం కూడా పెంచలేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభలో 25 తీర్మానాలు చేసినట్లు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి తెలిపారు. ఐక్య పోరాటాలు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, కడ పలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని, భద్రత కల్పించాలని, మహిళలకు మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని తీర్మానించి ఆమోదించా మన్నారు. రాష్ట్ర కార్యదర్శి సాయి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:30 PM