భూగర్భ జలాలు పెంచుతాం
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:31 PM
కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలను పెంచేందుకు జలధార - జలహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
చెరువులు, వాగుల్లో పూడిక తీసివేత పనులకు శ్రీకారం
ఆక్వా పరిశ్రమను ప్రోత్సహిస్తాం
అవుకు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోత) : కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలను పెంచేందుకు జలధార - జలహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర, జలధార - జలహారతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వేములపాడు గ్రామానికి చేరుకున్న మంత్రి బీసీకి టీడీపీ నాయకులు గుర్రప్ప, ప్రభాకర్, శ్రీనివాసులు, సుబ్బా రెడ్డి, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మంత్రి చెరు వులో పూడికతీత పనులకు పూజలు చేసి జలధార పనులను ప్రారంభించారు. ప్రజలతో కలసి వేములపాడు చెరువులో పెరిగిన జమ్మును కొడవలితో కొస్తూ తొగించారు. చెరువు వెంట 2 కి.మీ నడుచుకుంటూ వెళ్లి చెరువులో చేరిన పూడికను, దెబ్బతిన్న తూమును పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులను వాగులను గుర్తించి ప్రణాళి కాబద్ధంగా పూడిక తొలగిస్తామన్నారు. ఆక్వా పరిశ్రమను ప్రోత్స హించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. వైసీపీ పాలనలో చెరువుల అభివృద్ధి నిధులు విడుదల చేయక పోవటంతో పూడిక చేరి నీటి నిల్వ శాతం తగ్గిపోయి భూగర్భ జలాలు అడుగంటాయని విమర్శించారు. వేములపాడు చెరువు 100 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. చెరువులోని పూడికను తొలగించి తూమును రూ. 20 లక్షలతో మరమ్మతు చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే 500 ఎకరాలకు సాగునీరు అంది సస్యశ్యామలం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి, ఎంపీడీవో రామక్రిష్ణవేణి, మైనర్ ఇరిగేషన్ ఏఈ రామ మోహన్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు మారం పుల్లారెడ్డి, బనగానపల్లె మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.