సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:00 AM
సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు.
మోకాళ్లపై కూర్చొని కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల నిరసన
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగులు 12వ రోజు తమ సమ్మెను కొనసాగించారు. గురువారం మధ్యాహ్నం మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు స్టాఫ్ నర్సు, పారా మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జేఏసీ జిల్లా సభ్యుడు మౌలాలి మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ కమిటీ నిర్ణయం మేరకు తమ కార్యాచరణను కొనసాగిస్తామని, ఆన్‌లైన్ రిపోర్టులు నెలవారి రిపోర్టులు ప్రభుత్వానికి అందజేయకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, వందశాతం గ్రాస్ వేతన చెల్లింపు కచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు వినయ్, రమేష్, పుష్ప, ఫార్మాసిస్టు, శ్రీలక్ష్మి, గీతావాణి, మదీనా, ల్యాబ్ టెక్నీషియన్లు హైమావతి, శారద, బయోమెడికల్ ఇంజనీర్ ఉమేష్ పాల్గొన్నారు.