చెరువులను నింపుతాం
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:18 AM
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుగంగ, కేసీ కెనాల్ నీటితో చెరువులను నింపుతామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం కొండమాయపల్లె చిన్నరాజచెరువు, దక్షిణకొట్టాలు, పెదరాజచెరువులో పూజలు చేశారు.
సర్పంచ్‌ల డబ్బు కొట్టేసిన జగన్ : ఎమ్మెల్యే అఖిలప్రియ
రుద్రవరం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుగంగ, కేసీ కెనాల్ నీటితో చెరువులను నింపుతామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం కొండమాయపల్లె చిన్నరాజచెరువు, దక్షిణకొట్టాలు, పెదరాజచెరువులో పూజలు చేశారు. తెలుగుగంగ, కేసీ కెనాల్ నీటితో ఇప్పటివరకు 10 చెరువును నింపామని, రైతులు సంయమనం పాటించాలన్నారు. 2027 జూన్ వరకు తాగునీటికి ఉపయోగించుకోవాలని సూచించారు. వైసీపీ నాయకులు నీటి వనరులు తక్కువగా ఉన్నాయని వరి సాగు చేయవద్దని రైతులకు చెప్పారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు నీటి రాజకీయాలు చేయడం తగదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ సర ్పంచుల జేబుల నుంచి డబ్బులు కొట్టేశారని విమర్శించారు. అప్పట్లో గ్రామాల అభివృద్ధి కుంటు పడిన విషయం వైసీపీ నాయకులకు తెలియదా అంటూ ప్రశ్నించారు.
దక్షిణకొట్టాలు గ్రామంలో శ్మశానానికి స్థలం ఇచ్చిన దాత గోకుల శ్రీనుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన కలెక్టరు రాజకుమారికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కన్వీనరు ఎల్‌వీ రంగనాయకులు, భూమిరెడ్డి వెంకటక్రిష్ణరెడ్డి, బాలరాజు, మధుసూదనరెడ్డి, సర్వారెడ్డి, ఛైర్మన్ ప్రభావతమ్మ, వైస్ ఛైర్మన్ శివశంకర్, చంద్రశేఖర్, నాగిరెడ్డి, తెలుగుగంగ ఈఈ మురళీక్రిష్ణ, తెలుగుగంగ ప్రాజెక్టు ఛైర్మన్ సంజీవ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
ఆళ్లగడ్డ: అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు టీడీపీలో గుర్తుంపు అంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావవేశం నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని, రానునన్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, భూమా కుటుంబానికి ప్రజలే అండ అని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.