Share News

ప్రతి రైతుకూ భూహక్కు కల్పిస్తాం

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:10 AM

అర్హులైన ప్రతి రైతుకూ భూహక్కును ప్రభుత్వం కల్పిస్తుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

ప్రతి రైతుకూ భూహక్కు కల్పిస్తాం
పట్టాదార్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి రైతుకూ భూహక్కును ప్రభుత్వం కల్పిస్తుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. గురువారం మండలంలోని గుంతనాల గ్రామంలో మీభూమి- మీహక్కు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ నేత జగన్‌ పట్టాదార్‌ పుస్తకాలపై బొమ్మ వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్డీవో చల్లా విశ్వనాధ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, తహసీల్దార్‌ శ్రీనివాసులు, టీడీపీ ఇన్‌చార్జి కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:10 AM