Share News

బాధితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:35 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 104 ఫిర్యాదులు

కర్నూలు క్రైం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యా లయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్ర మానికి మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ హుస్సేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, రామయ్యనాయుడు, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు

తన కుమారుడు తన పోషణ చూసుకోకుండా తన ఇంటిని ఆక్రమించి అద్దె వసూలు చేసుకుంటున్నాడని, ఎలాంటి జీవనాధారం లేకుండా చేశా డని కర్నూలు వన్‌టౌన్‌కు చెందిన రమేష్‌ ఫిర్యాదు చేశారు. తన మూడె కరాల పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలని కోడుమూరు మండలం బైనదొడ్డి గ్రామానికి చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు. తన భర్త మరణించిన తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేశానని, ప్రస్తుతం కుమారుడు, కోడళ్లు కలిసి ప్రతి రోజు వేధిస్తూ.. ఇల్లు వారి పేరుపై రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ఇబ్బంది పెడుతున్నారని కర్నూలు షరీఫ్‌నగర్‌ చెందిన వెంకటలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. నగరంలోని శ్రీరామ థియేటర్‌ నుంచి ఆర్‌ఎస్‌ రోడ్డు వరకు బంగారుపేట మీదుగా వెళ్లే రహదారిలో చేపల కేంద్రం వద్ద శుద్ధి చేసే వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం, కొన్ని దుకాణాలు, రహదారిని ఆక్రమించడం వల్ల పాదాచారులు, మహిళల, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కర్నూలు బంగారుపేటకు చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం కోటకొండ గ్రామానికి చెందిన సుమలత ఫిర్యాదు చేశారు. రూ.16 లక్షలు విలువ చేసే మిరప పంటను తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని క్రిష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామానికి చెందిన మండ్ల శ్రీకేశులు ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 03 , 2026 | 11:35 PM