బాధితులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:34 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టం ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామ ని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు.
కర్నూలు క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టం ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామ ని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. సోమవారం స్థానిక కొత్త పేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 130 ఫిర్యా దులు వచ్చాయి. సీఐలు శివశంకర్, రామాంజులు, మస్తాన్‌వలి పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌కు చెందిన ఒక మెడికల్ షాపు యజమాని తమ మెడికల్ ఏజెన్సీ నుంచి మందులు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు కొత్తపేటకు చెందిన రాజు ఫిర్యాదు చేశారు. కర్నూలు మాధవినగర్‌లో ఉండే తన అల్లుడు కోర్టు విచారణలో ఉన్న ముగ్గురు సాక్షులను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. పొలంలో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవనకొండ మండలం, నల్లచెల్లిమల గ్రామానికి చెందిన ప్రమీల ఫిర్యాదు చేశారు. తన కొడుకు, కోడలు చూసుకోవడం లేదని, అన్నం పెట్టకుండా ఇబ్బందులకకు గురి చేస్తున్నారని కర్నూలు నాగప్ప వీధికి చెందిన ఈశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న ఏడు సంచుల వరి బియ్యం ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన జయమ్మ ఫిర్యాదు చేశారు.