Share News

బాధితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:07 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామ ని కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు.

బాధితులకు న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీఎస్పీ రాఘవేంద్ర

డీఎస్పీ రాఘవేంద్ర

కర్నూలు క్రైం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామ ని కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపే టలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 121 పిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో సీఐలు శివశంకర్‌, పార్థసారధి, రామకృష్ణ, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..: కర్నూలు ప్రభుత్వ ఆసపత్రిలో నెలకు రూ.38వేల జీతంతో స్టాఫ్‌ నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలు ఫోరెన్సిక్‌ డిపార్టుమెంటులో పని చేసే ఎర్రవల్లి వేణు రూ.5.50 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు శ్రీరామ్‌నగర్‌ చెందిన సుప్రియ ఫిర్యాదు చేశారు. పొలం ఆక్రమించుకోవాలని కొట్టి గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవనకొండ మండలం తెర్నేకల్‌ గ్రామానికి చెందిన గిడ్డమ్మ ఫిర్యాదు చేశారు. పదిమందికి రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని కల్లూరు చెందిన గోవిందు ఫిర్యాదు చేశారు. ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి కల్లూరు మండలం ముజఫర్‌నగర్‌ చెందిన మహబూబ్‌ రూ.8లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు స్వామిరెడ్డినగర్‌ చెందిన రామేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్‌వైజర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.1.60 లక్షలు తీసుకుని మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని గూడూరు మండలం నాగులాపురం చెందిన మద్దిలేటి పిర్యాదు చేశారు.

Updated Date - Jun 22 , 2026 | 11:07 PM