Share News

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:08 PM

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జిల్లా పరిషత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జడ్పీ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ రాజకుమారి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న మండల రిసోర్స్‌ సెంటర్‌ భవనాన్ని తాత్కాలిక జిల్లా పరిషత్‌ భవనంగా ఏర్పాటుచేశారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

జడ్పీ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నుంచే కార్యకలాపాలు

తాత్కాలిక జిల్లా పరిషత్‌ భవనం ప్రారంభం

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జిల్లా పరిషత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జడ్పీ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ రాజకుమారి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న మండల రిసోర్స్‌ సెంటర్‌ భవనాన్ని తాత్కాలిక జిల్లా పరిషత్‌ భవనంగా ఏర్పాటుచేశారు. శుక్రవారం తాత్కాలిక జడ్పీ భవనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పరిషత్‌ వ్యవస్థను పటిష్టం చేద్దామన్నారు. ఇక నుంచి ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. కొత్త జిల్లాకు జడ్పీ కార్యాలయం రావడం అదృష్టమన్నారు. తొలి ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. సీఈవో, డిప్యూటీ సీఈవోలను త్వరలో నియమి స్తామని, అప్పటివరకు ఉమ్మడి జిల్లా సీఈవో, డిప్యూటీలు విధులు నిర్వహిస్తార న్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా ప్రజా పరిషత్‌కు 45 మంది ఉద్యోగులను కేటాయించారన్నారు. డిప్యూటీ సీ ఈవో సుబ్బారెడ్డి, ఆర్‌డీవో విశ్వనాథ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ శ్రీనివాసులు, స్వర్ణగ్రామ- స్వర్ణ అవార్డు అఽధికారి లలితాబాయి, జిల్లా పంచాయతీ అధికారి ఫణికుమార్‌నాయక్‌, ఎంపీడీవో సుగుణశ్రీ, డీఎల్‌డీవో శివారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:08 PM