అర్జీదారులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:23 PM
ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు.
ఎస్పీ సునీల్ షొరాణ్
పీజీఆర్‌ఎస్‌లో 75 ఫిర్యాదులు
నంద్యాల క్రైం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు. చట్టపరిధిలోని సమస్యలకు అధికారులు విచారించి తక్షణమే పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్)లో వివిధ సమస్యలపై 75 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై విచారణ నిర్వహించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కారం చూపాలని అధికారులను అదేశించారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదని ఆయన సూచించారు.