విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:46 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకా రం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
కర్నూలు క్రైం, జూలై 13(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకా రం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేట లోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొ త్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్‌వలి పాల్గొన్నారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు
పెరుమాళ్ల విజయ్ కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.34వేలు తీసుకుని మోసం చేశాడని కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామానికి చెందిన ఎస్.హుస్సేన్ ఫిర్యాదు చేశారు. తన కుమారుడు షణ్ముఖ మృతిపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. సెలూన్, బ్యూటీపార్లర్ , టాటూ స్టూడియోలకు ప్రాంచైజీ ఇస్తామని నమ్మించి అగ్రిమెంటు చేసుకుని, మెటీరియల్ పేరుతో రూ.60 లక్షలు తీసుకుని హైదరాబాదు చెందిన మార్కెటింగ్ మేనేజర్ బృహస్పతిరావు, నరసరావుపేటకు చెందిన ఆశ్రఫ్‌వలి మోసం చేశారని కర్నూలు చెందిన చకిత ఫిర్యాదు చేశారు. తన తమ్ముడు ఫోర్జరీ చేసి నకిలి సర్టిఫికెట్లు సృష్టించి తనకు రావాల్సిన తండ్రి ఉద్యోగం రాకుండా మోసం చేశారని కర్నూలు ఎర్రబురుజు చెందిన అరుణ, జ్యోతయ్య ఫిర్యాదు చేశారు. కొ డుకు, కోడలు ఆస్తికోసం వేధింపులకు గురి చేస్తున్నారని కల్లూరు చెం దిన నాగేశ్వరరావు ఫిర్యాదుచేశారు. తన తమ్ముళ్లు, మామ, అత్తల నుం చి ఉద్యోగాల పేరుతో రూ.60లక్షలు తీసుకుని మోసం చేసిన కల్లూరు చెందిన నాయకంటి మహేశ్వరిపై చర్యలు తీసుకోవాలని కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన పార్వతమ్మ ఫిర్యాదు చేశారు.