Share News

వేదవతి, నగరడోన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:10 PM

ఆలూరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు.

వేదవతి, నగరడోన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
మాట్లాడుతున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

డీఎస్సీపై జగన్‌ తప్పుడు ఆరోపణలు

స్థానిక ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేద్దాం

కూటమి ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యం

ఆలూరు టీడీపీ సమీక్షా సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత

ఆలూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆలూరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు. సోమవారం పట్టణంలో సుంకులమ్మ దేవాలయాన్ని వారు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహర్షి వాల్మీకి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. టీడీపీ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి వర్షంలో సైతం లెక్కజేయకుండా ర్యాలీగా వెళ్లారు. టీడీ పీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి స్వగృహంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించి ని యోజకవర్గ సమస్యల పై చర్చించారు. అనంతరం నియోజకవర్గ వి స్తృతస్థాయి సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షురా లు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 53 కోట్లతో నగరడోన రిజర్వాయర్‌ పనులు మొదలుపెట్టామని, అలాగే రూ.1607 కో ట్లు కేటాయించి వేదావతి ప్రాజెక్టు పనులు చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులు విస్తృతంగా సాగుతున్నాయన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబునాయుడిదేనన్నారు. గత ప్రభుత్వంలోని జలవనరులశాఖ మంత్రులకు పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. అటువంటి వారు రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై ఓర్వలేకే మెగా డీఎస్సీపై జగన్‌ విమర్శలు చేయడం సరికాదన్నారు. త్వరలో మరో డీఎస్సీ కూ డా నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ లూరు నియోజకవర్గంలో వైసీపీను భూస్థాపితం చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రజక, కురువ కార్పొరేషన్ల చైర్మన్లు సావిత్రి, దే వేంద్రప్ప, మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్‌, ఎల్‌ఎల్‌సీ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు మిక్కిలినేని ప్రసాద్‌, ఏబీసీ చైర్మన్‌ నగరడోన కిష్టప్ప, మార్కెట్‌యార్డు చైర్మన్‌ వెంకటేష్‌, సీనియర్‌ నాయకులు మీనాక్షినాయుడు, కామినహాల్‌ రమేష్‌, రామచంద్రనాయుడు, శేషగిరి, గోవింద్‌గౌడ్‌, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఆదినారాయణ, జనసేన ఇన్‌చార్జి వెంకప్ప, బీజేపీ నాయకులు విట్టా రమేష్‌, తిమ్మప్ప, వెంకటరాముడు, బసవరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:10 PM