రింగ్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం: మంత్రి బీసీ
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:24 AM
బనగానపల్లె పట్టణం చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
బనగానపల్లె, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణం చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం బనగానపల్లె పట్టణానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కూడళ్లను రాష్ట్ట అర్కిటెక్ అధికారులతో కలసి పరిశీలించారు. రింగ్ రోడ్డులో అనుసంధానం అయ్యే ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ అంశాలను అధికారులతో చర్చించారు. బనగానపల్లె నియోజకవర్గానికి ఉన్న చారిత్రక నేపథ్యం, సంస్కృతి, ప్రత్యేకతలను ప్రతిబింబించేలా పట్ణణ ప్రవేశ ప్రాంతాల్లో ముఖద్వారాలను నిర్మించడం గురించి అధికారులతో చర్చించారు. ఆధునిక హంగులతో ముఖద్వారాలు కూడళ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.