డిసెంబరుకి రింగ్ రోడ్డు పనులు పూర్తిచేస్తాం
ABN , Publish Date - May 25 , 2026 | 10:53 PM
డిసెంబరుకి రింగ్‌రోడ్డు పను లు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, మే 25 (ఆంధ్రజ్యోతి): డిసెంబరుకి రింగ్‌రోడ్డు పను లు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఈ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. ముస్లిం మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణం పూర్తికాగా త్వరలో షాదీ ఖానాను ముస్లింలకు అంకితం చేస్తామన్నారు. అవుకు మెట్ట ప్రాంతంలో జరుగుతున్న నాలుగులైన్ల రోడ్డు పనులను, ఆర్డీవో కార్యాలయ పునరు ద్ధరణ పనులు పరిశీలించి అఽధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ అభివృద్ధి పనులను ఆయన తనిఖీలు చేపట్టారు.