Share News

రాయలసీమ ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేయిస్తాం

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:12 AM

ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేయిస్తామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేయిస్తాం
మాట్లాడుతున్న వైసీపీ కో ఆర్డినేటర్‌ సజ్జల

వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేయిస్తామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం పోతిరెడ్డిపాడు వద్ద రైతు శంఖారావం పేరిట బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేశారని చెప్పినా కూడా చంద్రబాబు ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు. వామపక్షపార్టీలను కలుపుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును రాజకీయ సమాధిచేసి మళ్లీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీమంత్రి, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పఽథకం పనులను నిలిసేసి రాయలసీమ రైతాంగానికి అన్యాయం చేసిందీ చంద్రబాబేనన్నారు. పనులు చేయకపోతే భవిష్యత్తు మరెన్నో ఉద్యమాలు తప్పవన్నారు. వైసీపీ రాష్ట్ర యువజన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజవర్గం నుంచే నిర్మించిన ప్రాజెక్టుల నుంచి ఆరు జిల్లాల రైతులకు సాగునీరు అందుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం సర్వస్వం తాము కోల్పోయామని అన్నారు. ఏళ్లు గడిచిన సర్వం కోల్పోయిన నిర్వాశితులకు 98 జీవో ఉద్యోగాలురాక రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు ఆరుజిల్లాల పరిధిలోని వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. బహిరంగసభ ఆలస్యంగా ప్రారంభం కావడంతో పార్కింగ్‌ లేకపోవడంతో భారీ వాహనాలు ప్రధాన రహదారిపైనే నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Feb 06 , 2026 | 12:12 AM