ప్రతి నిరుపేదకూ పక్కా ఇళ్లు కట్టిస్తాం
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:59 PM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
అభివృద్ధికి ఆకర్షితులై..
టీడీపీలోకి 400 కుటుంబాలు
శ్రీశైలం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,200 కుటుంబాలకు పైగా పట్టాలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. మంగళవారం టీడీపీ మండల ఇన్‌చార్జి యుగంధర్ రెడ్డి అధ్యక్షతన శ్రీశైలంలోని కొత్తపేట, శ్రీగిరి, ఎస్సీఎస్టీ కాలనీ, పాతాళగంగ సుమారు 400 కుటుంబాలకు పైగా టీడీపీలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైల మండలంలో ప్రధానమైన మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.7 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అదే విధంగా వీధి దీపాలు, స్తంభాలు, విద్య, వైద్య రంగాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రమణ, సుభాని, వట్టి వెంకటరెడ్డి, జిలానితోపాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి
శ్రీశైలం : దసరా మహోత్సవాలలో ప్రత్యేక పూజలందుకుంటున్న శ్రీశైల భ్రమరాంబదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం శ్రీశైలం వచ్చిన ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రధాన గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు, సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, ఆకుల శ్రీనివాస్‌లు సంప్రదాయానుసారంగా స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్న ఆయనకు వేదపండితులు ఆశీర్వదించి శేషవస్త్రాలతో సత్కరించారు.