బాధితులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:44 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 65 సమస్యలు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 65 సమస్యలు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమ వారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ శివశంకర్ పాల్గొన్నారు.