ఉధృతమైన ఉద్యమం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:08 AM
జిల్లా సాధన కోసం ఆందోళన ఉధృతమైంది. ఆదివారం ఆదోని జిల్లా సాధన జేఏసీ ఇచ్చిన పిలుపుతో బైక్ ర్యాలీకి భారీగా పురప్రజలు, గ్రామీణ ప్రాంత వాసులు, ఉద్యో గులు, యువత, అన్ని రాజకీయ పార్టీ నాయకులు తరలివచ్చారు. కోట్ల కూ డలి వద్ద ఉన్న దీక్షా శిబిరం నుంచి జేఏసీ నాయకులు రఘురామయ్య, లలిత, అశోకానందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, ఆదినారాయణ ర్యాలీ ప్రారం భించారు
బైక్ ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజానీకం
64వ రోజు దీక్షలో బీజేపీ నాయకులు
ఆదోని అగ్రికల్చర్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా సాధన కోసం ఆందోళన ఉధృతమైంది. ఆదివారం ఆదోని జిల్లా సాధన జేఏసీ ఇచ్చిన పిలుపుతో బైక్ ర్యాలీకి భారీగా పురప్రజలు, గ్రామీణ ప్రాంత వాసులు, ఉద్యో గులు, యువత, అన్ని రాజకీయ పార్టీ నాయకులు తరలివచ్చారు. కోట్ల కూ డలి వద్ద ఉన్న దీక్షా శిబిరం నుంచి జేఏసీ నాయకులు రఘురామయ్య, లలిత, అశోకానందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, ఆదినారాయణ ర్యాలీ ప్రారం భించారు. అక్కడ నుంచి మునిసిపల్ మెయిన్ రోడ్డు, వైఎస్సార్ విగ్రహం నుంచి శ్రీనివాసభవన్, తిక్కస్వామి దర్గా, ఆర్ట్స్ కళాశాల రహదారి, బసవేశ్వర సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా నిర్మల్ టాకీస్ నుంచి దీక్షా శిబిరానికి చేరుకుంది. రెండు నెలలుగా ఆదోని జిల్లా సాధన కోసం పశ్చిమ ప్రాంత ప్రజలంతా కలిసి వచ్చి ఆం దోళన చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగ నూరు, మంత్రాలయం నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లా చేయాలని డిమాండ్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచే ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళ నను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 64వ రోజు దీక్షలో ఆదో ని మండల బీజేపీ అధ్యక్షుడు బోయ ఉషారాజు, ప్రధాన కార్యదర్శి కోపి గయ్య, ఆంజనేయులు, న్యాయవాది రామాంజి, ఇస్వీ నాగప్ప, రవికుమార్, రాజబాబు, వినీత గుప్తా, గోపాల్, ఉసేనీ, రామకృష్ట్ర, వెంకటేష్, నగేష్, లక్ష్మన్న, రాజేష్, గోవిందు కూర్చున్నారు. దీక్షలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్ మాజీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, ఉపేంద్ర సంఘీభావం తెలిపారు. ర్యాలీలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్ దస్తగిరి, వెంకటేష్, రఘునాథ్ రెడ్డి, దేవా, ప్రేమ్ కుమార్, ఆనంద్ రాజ్ జగదీష్ సుజ్ఞానమ్మ పాల్గొన్నారు.