Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - May 06 , 2026 | 12:27 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పరి శ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
మంగళగిరిలో వినతులు స్వీకరిస్తున్న మంత్రి టీజీ

కర్నూలు అర్బన్‌, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పరి శ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలు గుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్ర మానికి విత్ననాభివృద్ధి సంస్థ చైర్మన్‌ మన్నెం ధర్మవరం సుబ్బారెడ్డితో కలిసి మంత్రి టీజీ భరత్‌ వినతులు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి బాధితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక తోడ్పాటు కల్పించాలని కొందరు అర్జీలు అందించారు. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హమీ ఇచ్చారు.

Updated Date - May 06 , 2026 | 12:27 AM