Share News

సాంకేతికతను వాడుకోవాలి

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:14 PM

ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు ఉపయోగించుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆదేశించారు.

సాంకేతికతను వాడుకోవాలి
అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నేర సమీక్షలో అధికారులకు సూచనలిచ్చిన ఎస్పీ సునీల్‌ షెరాన్‌

దొంగతనాల నియంత్రణకు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశం

నంద్యాల క్రైం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు ఉపయోగించుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్‌ పోలీసు కార్యాలయాల పరిధిలోని పోలీసు అధికారులతో మంగళ వారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులు, వాటి స్థితిగతులు, కేసుల దర్యాప్తుపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హత్యలు, హత్యా యత్నా లు, మహిళలపై నేరాలు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించి నమోదైన కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షపడేలా అన్ని ఆధారాలు సేకరించి చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. పూర్తిస్థాయిలో విచారణ, దర్యాప్తు చేపట్టి కచ్చితమైన ఆధారాలతో కోర్టుకు సమర్పించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లా మట్కా, జూదం, అక్రమ మద్యం రవాణా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పోలీసు స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించు కోవాలని, నిర్ణీత గడువులోగా పెండింగ్‌ కేసులను పరిష్కారదశకు తీసుకురా వాలన్నారు. అడిషనల్‌ ఎస్పీ ఎన్‌. యుగంధర్‌బాబు, నంద్యాల సబ్‌ డివిజన్‌ అధికారి ఏఎస్పీ ఎం. జావళి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, రామాంజినాయక్‌, శ్రీనివాస్‌, శ్రీనివాసులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:14 PM