ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:20 AM
భూమిని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని కలెక్టరు ఏ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల వద్ద రైతు సదాశివ రావు, వేణు హై డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు మామిడితోటను పరిశీలించారు.
కర్నూలు కలెక్టర్ ఏ.సిరి
ఇద్దరు రైతు సేవాకేంద్రాల అధికారులపై వేటు
దేవనకొండ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): భూమిని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని కలెక్టరు ఏ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల వద్ద రైతు సదాశివ రావు, వేణు హై డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు మామిడితోటను పరిశీలించారు. దేవనకొండలోని బడిగింజల రంగన్న పొలంలో పదాహారు ఎకరాల్లో కొబ్బరి మొక్కల సాగును పరిశీలించి, అంతరపంట వేరుశెనగ సాగుపై రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ జేడీ వరలక్ష్మి, ఏపీఎంఐపీ పీడి శ్రీనివాసులును మైక్రో ఇరిగేషన్ ద్వారా మండలంలో పండ్ల తోటలు, కొబ్బరి తోటల సాగు పెంచాలన్నారు. మన గ్రోమెర్ ఎరువుల దుకాణంలో తనిఖీ నిర్వహించి, రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి భూమి సాంద్రతను పెంచాలని సూచించగా అక్కడే ఉన్న కుంకనూరు, నెల్లిబండ రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి తమకు తెలియదన్నారు. వెంటనే ఆయా గ్రామాల రైతు సేవాకేంద్రాల అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఏపీఏఐఎమ్‌ఎస్ యాప్ ద్వారానే ఎరువులు విక్రయించాలని దుకాణదారులకు సుచించారు. పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని, గుండ్లకొండ వద్ద స్లూయిజ్ ఏర్పాటు చేసి పది గ్రామాలకు సాగు, తాగునీరు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ నాయకుల వీరశేకర్, నర్సారావ్‌వినతిపత్రం ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా అధికారి భాస్కర్‌నాయుడు, తహసీల్దార్ వైకే రామేశ్వరరెడ్డి, ఎంపీడీవో జ్యోతి, ఏవో ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవోలు గోపాల్, రఫీ తదితరులు ఉన్నారు.