Share News

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:56 AM

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వేగవంతానికి రాజకీయ పార్టీలు సహకరిం చాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌ అన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి
మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

నగర పాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వేగవంతానికి రాజకీయ పార్టీలు సహకరిం చాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌ అన్నారు. మంగళవారం వెంకటరమణకాలనీలోని నగర పాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహిం చిన సమావేశంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చేయడం, మరణించిన వారి, డూప్లికేట్‌ పేర్లు తొల గించడం, చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరి చేయడం, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమన్నారు. సమావే శంలో అదనపు కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, ఎస్‌ఈ రమణమూర్తి, తహసీ ల్దార్‌ రవికుమార్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌ వై.వెంకటరమణ, డిప్యూటీ తహ సీల్దార్‌ ధనుంజయ, ఎలక్షన సూపరింటెండెంట్‌ సుబ్బన్న పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:56 AM