Share News

గ్రంథాలయాల పురోభివృద్ధికి తోడ్పడాలి

ABN , Publish Date - May 18 , 2026 | 12:13 AM

సాహిత్యకారులు, సామాజిక సేవకులు గ్రంథాలయాల పురోభివృద్ధికి తోడ్పడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర అన్నారు.

గ్రంథాలయాల పురోభివృద్ధికి తోడ్పడాలి
తుగ్గలి నాగేంద్రతో సత్కార గ్రహీతలు

జిల్లా గ్రంథాలయ సంస్థ చైౖర్మన్‌ తుగ్గలి నాగేంద్ర

కర్నూలు కల్చరల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): సాహిత్యకారులు, సామాజిక సేవకులు గ్రంథాలయాల పురోభివృద్ధికి తోడ్పడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర అన్నారు. ఆదివారం నగరం లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో భారతరత్న రవీంద్రనాథ్‌ టాగూర్‌ జయంతి పక్షోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పురస్కారాలు అందజేశారు. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ సోషల్‌ జస్టిస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కర్నూలు మెల్విన్‌ జోన్స్‌, నైస్‌ యూత్‌ ఫర్‌ కల్చరల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సిల్వర్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుగ్గలి నాగేంద్ర విచ్చేసి, అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాల యాలు సాహిత్య పోషణకు నిలయాలని అన్నారు. గ్రంథాలయాల ద్వారా నిరుద్యోగులకు ఉపయోగపడే అనేక పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి, తెలుగు భాషావేత్త జేఎస్‌ఆర్‌కే శర్మ, లయన్స్‌ క్లబ్‌ సీనియర్‌ ప్రతినిధి డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ తదితరులు ప్రసంగిం చారు. ఈ కార్యక్ర మంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మెమోరియల్‌ ఎక్స్‌లెన్సీ అవార్డులను సి. యాగంటీశ్వరప్ప, డాక్టర్‌ కె. స్వయంప్రభ, బీవీ స్వరూప్‌ సిన్హా, ఫషీయుల్లా, పరవస్తు లక్ష్మీసుశీల రాణి, అనుగోలు సంజీవ రాయుడు, పి. జ్యోతి, ఎం. ఖాజాబేగ్‌, డాక్టర్‌ శాంతి పవార్‌, మట్టి రవీంద ర్‌, షేక్‌ దరియా వలీ, మస్తాన్‌ ఖాన్‌లకు అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. .

Updated Date - May 18 , 2026 | 12:13 AM