Share News

మహిళగా పుట్టినందుకు గర్వపడాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:26 AM

మహి ళగా పుట్టినందుకు మనమందరం గర్వపడా లని కలెక్టర్‌ డా.ఏ. సిరి అన్నారు.

మహిళగా పుట్టినందుకు గర్వపడాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహి ళగా పుట్టినందుకు మనమందరం గర్వపడా లని కలెక్టర్‌ డా.ఏ. సిరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని సున యన ఆడిటోరియంలో మహిళా దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజ్‌ కింద సుమారు 1.30లక్షల మంది మహి ళలకు రూ.1,200 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఇతర పథకాలైన సీఐఎఫ్‌, వీజీఎఫ్‌, వీఆర్‌ఎప్‌, పీఎంఈజీపీ వంటి పథకాల ద్వారా వేలాది మంది మహిళలకు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. మెప్మాకి సంబంధించి 4502 స్వయం సహాయక బృంద సభ్యులకు రూ.613కోట్లతో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సావిత్రీ, వడ్డెర సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రిక, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సంజీవలక్ష్మి, బొందిల్ల కార్పొరే షన్‌ చైర్మన్‌ విక్రమ్‌సింగ్‌, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయభారతి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

రాజకీయాల్లో మహిళల రాణింపు

మహిళల పట్టుదల, ఓర్పు, సహనం, త్యాగాలను మనం ఎప్పుడూ మరువకూడదు. స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముం దంజలో ఉన్నారు. రాజకీయాల్లో గ్రామ స్థాయి వార్డు స భ్యుల నుంచి పార్లమెంటు స్థాయి వరకు మహిళలు రాణి స్తున్నారు.

గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, కర్నూలు

స్త్రీ లేనిదే సృష్టి లేదు

స్త్రీ లేనిదే సృష్టి లేదు.. స్త్రీ లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం. ఎప్పుడైతే స్త్రీని గౌరవిస్తారో, అటువంటి సమాజమే అభివృద్ది చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు 1995లో పొదుపు ఉద్యమాన్ని (డ్వాక్రా) ప్రారంభించారు.

గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే, పాణ్యం

అన్నిరంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ

గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. మహిళలు ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని నడిపించారు.

నూరుల్‌ ఖమర్‌, జేసీ, కర్నూలు

Updated Date - Mar 09 , 2026 | 12:26 AM