Share News

శ్రావణ మాసోత్సవాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:56 PM

శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలను ఘనంగా జరిపించడానికి సిద్ధం కావాలని ఈవో శ్రీనివాసరావు వివిధ విభాగాధిపతులకు సూచించారు.

శ్రావణ మాసోత్సవాలకు సిద్ధం కావాలి
శ్రీశైలం పరిపాలనా భవనంలో సమావేశమైన అధికారులు

రద్దీకి అనుగుణంగా దర్శన విధానాల్లో మార్పులు

ఈవో శ్రీనివాసరావు

శ్రీశైలం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలను ఘనంగా జరిపించడానికి సిద్ధం కావాలని ఈవో శ్రీనివాసరావు వివిధ విభాగాధిపతులకు సూచించారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 12 వరకు జరిగే మాసోత్సవాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీనికి తగినట్లుగా దర్శన విధానాలు, అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాలు, క్యూలైన్లు, కంపార్టుమెంట్ల నిర్వహణ, పారిశుధ్యం వంటి ప్రధాన విభాగాలలో చేపట్టవలసిన ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ నెల 28న జరిగే ట్రస్ట్‌బోర్డు సమావేశంలో సెలవు రోజుల్లో భక్తులకు అందుబాటులో ఉంచవలసిన దర్శనాలు వంటి కీలక నిర్ణయాలను చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్‌, వేదపండితులు, ప్రధానా ర్చకులు, ఏఈవోలు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:56 PM