గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:26 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ
కర్నూలు అర్బన్ , సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జోన్ -5 కోఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, నియోజవర్గాల ఇన్‌చార్జీలతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, నియోజవర్గాల ఇన్‌చార్జీలు తమ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, అభ్యర్థుల విజయానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమతమ నియోజవర్గాల పరిధిలో ఉన్న పరిస్థితులు, పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలు, తమ సూచనలు, అభిప్రాయాలను తెలపాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నియోజకవర్గం ఇన్‌చార్జీలు మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, నరసంహులు చౌదరి, కార్పొరేషన్ల డైరెక్టర్లు నంద్యాల నాగేంద్ర, ధరూర్ జేమ్స్ తదితరులు హాజరయ్యారు.