పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:44 AM
జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ
పత్తికొండ టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక గోపాల్ ప్లాజాలో బీజేపీ ఆధ్వర్యంలో స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) జిల్లా కార్యశాల సమావేశం గోవర్ధన్‌నాయుడు అధ్యక్ష తన జరిగింది. ముఖ్యఅతిథులుగా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ, కోడు మూరు మాజీ ఎమ్మెల్యే మురళి మోహన్, కర్నూలు జిల్లా ఇన్ చార్జి అంకల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున సంక్షేమ పథకాలను గ్రామీణస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక లను దృష్టిలో పెట్టుకొని బూత్‌స్థాయి లెవెల్‌లో పార్టీని మరింత బలంగా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంద ర్భంగా పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి నాయ కులు ఆహ్వానించారు. బిల్డింగ్ కార్పొరేషన్ చైర్మన్ విట్టా రమేష్, వాల్మీకి డైరెక్టర్ మురళీ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి సురవరం గీతామాధురి, స్థానిక నాయ కులు కరణం నరేష్, మల్లికార్జున, సి.సి.రంగన్న, బ్రహ్మయ్య, రామాంజినేయులు పాల్గొన్నారు.