సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:36 PM
జిల్లా, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
బనగానపల్లె జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈనెల 9న సీఎం చంద్రబాబునాయుడు బనగానపల్లెలోని ఉన్నత పాఠశాల మైదానంలో రైతులతో నిర్వహించే మీభూమి మీహక్కు బహిరంగ సభావేదిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లను, హెలిప్యాడ్ పనులను శనివారం పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అఽధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన భద్రతా చర్యలపై మంత్రి ఆరా తీశారు. భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు రానునండటంతో ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.