పచ్చదనం పెంపునకు సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:28 PM
జిల్లాలో పచ్చదనం పెంపుదలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యాసంస్థలను పర్యావరణహిత ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పచ్చదనం పెంపుదలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యాసంస్థలను పర్యావరణహిత ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రంలో బుధవారం నెట్ జీరో హెల్తీ క్యాంపస్ - ఎకాలజీ అండ్ ప్లాంటేషన్ (అల్ర్టా హై డెన్సిటీ ప్లాంటేషన్) కార్యక్రమం అమలు, కార్యాచరణ ప్రణాళికపై సంబంధిత శాఖల అధికారులతో వర్క్‌షాపు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. మొదటి విడతలో జిల్లాలోని సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబా ఫూలే, డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు సహా మొత్తం 56 విద్యాసంస్థల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్క్‌షాపులో డ్వామా పీడీ సూర్యనారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ కో ఆర్డినేటర్ అంకిత తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 13లోగా మైనార్టీ హాస్టళ్ల నిర్మాణం పూర్తి చేయాలి
జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హాస్టళ్ల పను లను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణం లోని వైఎస్సార్ నగర్ (మూలసాగరం గ్రామం) ప్రధాన రహదారి సమీపంలో నిర్మాణంలో ఉన్న మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలను పరిశీ లించారు. అధికారులను అడిగి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకు న్నారు. 2022లో హాస్టళ్ల నిర్మాణం కోసం 4.5 ఎకరాల భూమిని కేటాయించగా, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద వర్కింగ్ ఉమెన్ హాస్టల్, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్, ప్రీ మెట్రిక్ గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లతో కూడిన మొత్తం నాలుగు భవనాలు నిర్మిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్ కలెక్టర్‌కు వివరించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.10కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్త య్యాయని మిగిలిన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి భవనాలను అప్పగిస్తామని ఏపీడబ్ల్యూఏడీసీ ఇంజనీర్లు కలెక్టర్‌కు తెలిపారు. అనం తరం హాస్టల్ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో రామునా యక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, ఏపీడబ్ల్యూఏడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు.