Share News

గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:21 PM

మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు.

గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ సిరి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న విగ్రహానికి కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ చూపిన మార్గం కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ మొత్తానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించిన మహానుభావుడు అని కొనియాడారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పార్వతి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, మాంటిస్సోరి ఇండస్‌ పాఠశాలల అధినేత రాజశేఖర్‌, రాంభూపాల్‌ చౌదరి ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ రామేశ్వరరెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుమంత్‌ చౌదరి, మేనేజర్‌ విల్సన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:21 PM