Share News

మాదకద్రవ్య రహిత సమాజానికి కృషి చేయాలి

ABN , Publish Date - Oct 29 , 2026 | 10:59 PM

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పిలుపునిచ్చారు.

మాదకద్రవ్య రహిత సమాజానికి కృషి చేయాలి
అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాలలో 5 కి.మీ., 10 కి.మీ. మారఽథాన్‌

నంద్యాల హాస్పిటల్‌, అక్టోబరు 29, (ఆంధ్రజ్యోతి) : మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పిలుపునిచ్చారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌ ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌, ఎస్పీ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్‌ సమాచారం ఉంటే 112కు ఫోన్‌ చేయాలన్నారు. మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా 5 కి.మీ., 10 కి.మీ మారథాన్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మారథాన్‌ ర్యాలీ కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమై నూనెపల్లె హైవే బ్రిడ్జి, టెక్కె మార్కెట్‌ యార్డు మీదుగా తిరిగి కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు ఖాదర్‌ బాషా, చిన్ని కృష్ణ, సబ్‌ కలెక్టర్‌ మనిషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 10:59 PM