ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:26 AM
పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హనికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు వ్యాపారుల, ప్రజలకు పిలుపునిచ్చారు.
నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హనికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు వ్యాపారుల, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పాతబస్టాండు ప్రాంతంలోని దుకా ణాలను సందర్శించి, ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్ర్థాలపై వ్యాపా రులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగాన్ని వ్యాపారులు స్వచ్ఛందంగా పూర్తి నిలిపివేయాల ని కోరారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు నగర పాలక సంస్థ నిరంతర ప్రత్యేక తనిఖీలు నిర్వహస్తుందన్నారు. ఈ ఏడాదిలో ఇప్ప టివరకు 201 దాడులు నిర్వహించి 250 కిలోల పైగా నిషేదిత ప్లాస్టిక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.1,95,150 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర, కాగిత సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను విని యోగించాలని సూచించారు. ప్రతి వ్యాపారి తమ దుకాణం ముందు తప్పకుండా డస్ట్‌బిన ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అంతకుముందు సుంకేసుల రోడ్డు, ఎనఆర్‌పేట ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలిం చారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని అన్న క్యాంటీనను సందర్శించి అక్కడ అం దిస్తున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, శానిటరీ సూపర్‌వైజర్ రమేష్‌బాబు, శానిటరీ ఇనస్పెక్టర్లు మల్లికార్జున, లోకేశ తదితరులు పాల్గొన్నారు.