జాతీయ సమైక్యతను కాపాడుకోవాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:43 PM
జాతీయ సమైక్య తను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్‌యూ వీసీ వెంకట బసవరావు అన్నారు.
ఆర్‌యూ వీసీ వెంకట బసవరావు
కర్నూలు అర్బన, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జాతీయ సమైక్య తను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్‌యూ వీసీ వెంకట బసవరావు అన్నారు. శనివారం రాయలసీమ యూనివర్సిటీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ ఎస్‌ఎస్ యూనిట్ అధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రిజిసా్ట్రర్ విజయకుమార్ నాయుడు, ఇంజ నీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుందరానందపుచ్చా, డీన్లు సీవి కృష్ణారెడ్డి, భరతకుమార్, డా. ఎస్‌నాగ చంద్రుడు, వివిధ విభాగాల అధ్యాపకులు, వలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
దేశ సమగ్రతే ప్రతి భారతీయుడి లక్ష్యం : దేశ సమగ్రతే ప్రతి భారతీయుడి లక్ష్యమని సిల్వర్ జూబ్లీ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజశెట్టి అన్నారు. శనివారం ఆ కాలేజీలో (ఏక్తా దివస్) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం చేసిన కృషిని విద్యా ర్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్‌ఎం బాషా, నాగఅరుణ్, బడే సాహెబ్, రఘపతి రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరమ్మ: పేదల జీవితాల్లో ఇందిరాగాంధీ వెలుగులు నింపారని డీసీసీ అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాయంలో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి, దేశ తొలి మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మేయర్ అభ్యర్ధి డా. కలమల్ల తామర వేణి, సుబ్రహ్మణ్యం శెట్టి, బి.బ్రతుకన్న, ఎన్సీ బజారన్న, సాంబశివుడు, మల్లికార్జున యాదవ్, సుమలత, దామోదరం రాధాకృష్ణ పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని లయన్స క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పాతనగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో, అసోసియేషన ఆఫ్ అలయన్స క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ అధ్య క్షుడు కేసీ కల్కూర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావం పెంపొందించాలనే లక్ష్యంతో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమ తులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యారంగంలో, సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న పలువురికి సర్దార్ వల్లభాయ్ పురస్కారాలు అందజేసి సత్కరించారు. అనంతరం అసోసియేషన ఆఫ్ అలి యన్స ఇంటర్నేషనల్ ఐదు క్లబ్బుల అధ్యక్ష, కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలయన్స క్లబ్ ప్రతినిధులు పద్మా కర్, మురారి శంకరప్ప, త్రినాథ్‌కుమార్, తిరుపతిసాయి, డాక్టర్ జయ ప్రకాశ, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ నాయక్, కేజీ గంగాధరరెడ్డి, తాళ్లపాక నటరాజ, కేడీజే బాబు, డాక్టర్ రమేష్, శ్రీనివాసరావు, రాయపాటి నాగలక్ష్మి పాల్గొన్నారు.