షడ్రక్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:51 PM
సమాజ మార్పు కోసం షడ్రక్ స్ఫూర్తితో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే ఎంఏ. గఫూర్ పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): సమాజ మార్పు కోసం షడ్రక్ స్ఫూర్తితో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే ఎంఏ. గఫూర్ పిలుపునిచ్చారు. సీపీఎం నాయకుడు టి.షడ్రక్ 6వ వర్ధంతిని నగరంలో సీపీఎం నాయకులు నిర్వహించారు. మంగళవారం కార్మిక కర్షక భవన, స్థానిక గడియారం ఆసుపత్రి ఎదురుగా సుర్జీత భవన, షరీననగర్, వీకర్‌సెక్షనకాలనీ, ముజఫర్‌నగర్ తదతర ప్రాంతాలలో ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పాత బస్తీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కేకే భవనలో ప్రజానా ట్యమండలి కళాకారుల బృందం షడ్రక్ సేవలను స్మరించుకునేలా విప్లవ గీతాలను ఆలపించారు. ముఖ్యఅతిథులుగా ఎంఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కే.ప్రభాక ర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పీఎస్.రాధాక్రిష్ణ, ఎండి.అంజిబాబులు హాజరై షడ్రక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి టి.రాముడు, జిల్లా కమిటీ సభ్యుడు గురుశేఖర్, నగేష్, అలివేలు, పి.నిర్మల, సుధాకరప్ప, విజయ రామాంజనేయులు పాల్గొన్నారు.