Share News

స్వీయ గణనకు ముందుకు రావాలి

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:37 PM

స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు.

స్వీయ గణనకు ముందుకు రావాలి
5 కే రన్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జిల్లా అధికారులు

కలెక్టర్‌ రాజకుమారి

జనగణనపై అవగాహన కోసం 5కే రన్‌

నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టెక్కె మార్కెట్‌ యార్డులోని 5కే రన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. టెక్కె నుంచి గాంధీచౌక్‌ వరకు సాగిన ఈ రన్‌లో జిల్లా అధికారులు, యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 5కే రన్‌ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఉందన్నారు. స్వీయ గణన చేసి ప్రభు త్వానికి సహకరించాల న్నారు కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌, శానిటైజేషన్‌ సూపర్‌వైజర్‌ మురళి, జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:37 PM