ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:54 PM
ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అర్జీలను మంత్రి స్వీకరించారు. స్వయంగా సంబంఽధిత అధికారులకు ఫోన్లు చేసి పలు అర్జీలు పరిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. అర్జీలను పరిష్కరించడానికి కృషిచేసిన మంత్రి బీసీని ప్రజలు అభినందించారు.