Share News

పచ్చదనంలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:49 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల పిలుపునిచ్చారు.

పచ్చదనంలో భాగస్వాములు కావాలి
సీడ్‌ బాల్స్‌ చల్లడానికి సిద్ధంగా ఉంచిన డ్రోన్‌

జిల్లా అటవీశాఖ అధికారి శ్యామల

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల పిలుపునిచ్చారు. గురువారం నగరస సమీపంలోని జగన్నాథగట్టుపై నుంచి డ్రోన్ల ద్వారా పరిసర ప్రాంతాల్లో విత్తన బంతులను చల్లారు. శ్యామల మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50 శాతం వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. జిల్లావ్యాప్తంగా 7 లక్షల విత్తన బంతులను చల్లాలని నిర్ణయించామని, ప్రస్తుతానికి డ్రోన్ల ద్వారా 2 లక్షల విత్తన బంతులను చల్లుతున్నామని ఆమె చెప్పారు. అటవీ ప్రాంతం, రెవెన్యూ స్థలాల పరిధిలో వీటిని చల్లుతున్నామని, స్థానికంగా అందుబా టులో ఉండే వేప, చింత, కానుగ, ఉసిరి వంటి మొక్కలతో పాటు పండ్ల మొక్కల విత్తన బంతులు చల్లుతున్నామని తెలిపారు. వీటితో పాటు జిల్లా పరిధిలో మరో 40 లక్షల మొక్కలను నాటా లని ప్రణాళికలు రూపొందించినట్లు శ్యామల తెలిపారు. వీటిని ప్రజలకు సైతం ఉచితంగా అందజేస్తామని, ఆసక్తి కలిగిన వారు తమ నర్సరీలు కాని, ఉద్యానవన, డ్వామా పరిధిలోని నర్సరీల నుంచి మొక్కలను పొందవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ హరిత యజ్ఞంలో విద్యార్థులు, పాఠశాల, ఆసుపత్రుల యాజ మాన్యాలు, కాలనీ సంఘాలు, బహుళ అంతస్థుల నివాసితులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమష్టిగా పాలుపంచుకుని కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని శ్యామల కోరారు. విశ్రాంత అటవీ శాఖ అధికారి జయచంద్రారెడ్డి, అటవీ రేంజ్‌ అధికారులు ప్రియాంక, తేజస్విని, ఎఫ్‌ఆర్వోలు ఓబులేసు, రతిదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:49 PM