Share News

తల్లీ బిడ్డల ఆరోగ్యానికి పోషకాహారం

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:47 PM

తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ఎంతో కీలకమని కలెక్టర్‌ ఎ. సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన అడిటోరియంలో జిల్లా స్థాయి అంగన్‌వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు.

తల్లీ బిడ్డల ఆరోగ్యానికి పోషకాహారం
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు రాజ్‌విహార్‌సర్కిల్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ఎంతో కీలకమని కలెక్టర్‌ ఎ. సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన అడిటోరియంలో జిల్లా స్థాయి అంగన్‌వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ గర్భధారణ దశ నుంచే తల్లులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణిలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న టేక్‌హోమ్‌ రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత మాట్లాడుతూ గర్భిణిలు, బాలింతలు అంగన్‌వాడీల ద్వారా అందుతున్న పోషకాహారంతో పాటు చిరుధాన్యాలు అందుబాటులో ఉండే పోషకాహార పదార్థాలను వినియోగించాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 9 ప్రాజెక్ట్‌ల పరిధిలో పోషణ్‌ ఛాంపియన్లుగా ఎంపికైన 9 మంది తల్లులను ఘనంగా సన్మానించారు. ఇదే క్రమంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ పి. విజయ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీసీహెచ్‌జప్రుల్లా, ఎల్‌సీసీ మాధవీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:47 PM