ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:46 PM
నగర పాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు అందరూ సిద్ధంగా ఉండాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
అడిషనన్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు అందరూ సిద్ధంగా ఉండాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామని, సంబంధిత అధికారులు ఎలాంటి పొరపాట్లు చేయకుండ పూర్తి అవగాహనతో, సమర్థతతో పని చేయాలని సూచించారు. నోటిఫికేషన్ వచ్చేలోపు రాజకీయ పార్టీల నాయకుల ఫొటోలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హెల్ప్ డెస్క్, సీసీ కెమెరాల ఏర్పాటు, మోడల్ కోడ్ కండక్ట్ అమలు, ఎన్‌వోసీ పత్రాల జారీ వంటి ప్రక్రియలను చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవాలాని, పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ మేయర్ అభ్యర్థికి, వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ కార్పొరేటర్ అభ్యర్థికి ఇస్తారని చెప్పారు. షామియానాలు, బారికేడ్లు, భోజన ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీ్‌షకుమార్‌రెడ్డి, మేనేజర్ జునైద్, ఎస్‌ఈ జె.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఇన్‌చార్జి డీసీపీ శభ్నం శాస్త్రి, ఏసీపీ నాగరాజు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌బాషా, ఆర్వోలు వాజిద్, క్రిష్టఫర్, మంజూర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.