ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:14 AM
knl news
- ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
-ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ
శ్రీశైలం, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమ పథకాల అమలుతో కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న బలమైన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శ్రీశైల క్షేత్ర పరిధిలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో మంగళవారం రెండవ రోజు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రంలో కొన్నేళ్లుగా దేవస్థానంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు తమకు ఉపాధి కల్పించాలని, వసతి గృహాలు కట్టించి ఇవ్వాలని చేసిన వినతులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట శ్రీశైలం ఇన్‌చార్జి యుగంధర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రమణ, జూలే నాయక్, బద్రినాయక్ ఉన్నారు.