Share News

కరువును చూశాం..

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:40 PM

ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువును చూశామని, కేంద్రానికి నివేదికలు అందజేస్తామని కేంద్ర బృందం సభ్యుడు పొన్నుస్వామి అన్నారు. సోమవారం మండలంలోని పెరవలి గ్రామంలో ఎండిపోయిన పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగు పరిస్థితులు, వర్షాభావ ప్రభావం, పంటల దిగుబడులపై ఆరా తీశామన్నారు

కరువును చూశాం..
జూటూరు రైతు లక్ష్మమ్మ పత్తిపంట పరిశీలిస్తున్న బృందం

కేంద్రానికి నివేదికలు పంపిస్తాం

కేంద్ర కరువు బృందం సభ్యులు

మద్దికెర, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువును చూశామని, కేంద్రానికి నివేదికలు అందజేస్తామని కేంద్ర బృందం సభ్యుడు పొన్నుస్వామి అన్నారు. సోమవారం మండలంలోని పెరవలి గ్రామంలో ఎండిపోయిన పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగు పరిస్థితులు, వర్షాభావ ప్రభావం, పంటల దిగుబడులపై ఆరా తీశామన్నారు. మండలంలో నెలకొన్న కరువు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించామనీ, ఆ నివేదికలు కేంద్రానికి పంపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు అనరాధపఠానా, ధీరేంద్రకుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, సాక్షిబడోరియా, ఆర్డీవో చిన్న ఓబులేసు, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వరలక్ష్మి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రాజశేఖర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ డా. మల్టన్‌, తహసీల్దార్‌ గూండాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నీళ్లు లేవు.. మేత లేదు.. పనులూ లేవు..

ఎల్‌నినో ప్రభావం వల్ల తాగడానికి నీల్లు లేవని, పశువులకు మేత లేదని, చేద్దామంటే వ్యవసాయ పనులు లేవని రైతులు కేంద్ర బృందం సభ్యుల ముందు మొర పెట్టుకున్నారు. సోమవారం పెరవలి గ్రామానికి క్షేత్ర స్థాయిలో కరువును పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు పొన్నుస్వామి ఆధ్వర్యంలో పర్యటించారు. విషయం తెలుసుకున్న రైతులు మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మెడికల్‌ తిమ్మప్ప, ప్రధాన కార్యదర్శి పెరవలి రామాంజులు తదితరులు మాట్లాడుతూ ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా కరువు విలయతాండవం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మూలింటి రాము యాదవ్‌, సుధాకర్‌, సీపీఐ నాయకులు పెరవలి సుధాకర్‌, గ్రామస్థులు, వ్యవసాయాధికారి రవి తదితరులు ఉన్నారు.

ఎండిన పంటల పరిశీలన

పత్తికొండ, నవంబరు2,(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నహుల్తి, జూటూరు గ్రామాల పరిధిలో కేంద్ర కరువు బృందం సభ్యులు పొన్నుస్వామి, ఎం.వేణుగోపాల్‌, అనురాధాబటానా, ధీరేంద్రకుమార్‌, ప్రదీ్‌పకుమార్‌, డాక్టర్‌ సాక్షి భదౌరియాలు పత్తి, సజ్జ పంటలను పరిశీలించారు. రైతులు రంగస్వామి, పులికొండ, లక్ష్మమ్మలతో పంటలసాగుకు అయిన ఖర్చు, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాధారం వ్యవసాయ చేస్తున్నామని, ముందస్తు వర్షాలకు పంటలు సాగుచేసి ఆతర్వాత ఏర్పడే వర్షాభావానికి పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోతున్నామని రైతులు వారికి తెలిపారు. ఆర్డీవో ఓబులేసు, ఏవో వెంకట్రాముడు, ఆర్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఎకరాకు రూ50వేలు పరిహారం ఇవ్వాలి

జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులను పూర్తిస్తాయిలో అధ్యయనం చేసి రైతులకు ఎకరాకు కనీసం రూ50వేలు కరువు పరిహారం అందించాలి. ఈ ఏడాది తీవ్రవర్షాభావ పరిస్థితులతో కరువు పరిస్థితులు తీవ్రంగా ఏర్పడ్డాయి. - రామచంద్రయ్య, ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - Nov 02 , 2026 | 11:40 PM