Share News

ప్రజల నమ్మకాన్ని పొందాం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:31 AM

వాణిజ్య బ్యాంకుల కంటే దీటుగా ప్రజల నమ్మకాన్ని పొందామని కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కే.పార్చూన్‌ ఫంక్షన్‌ హాలులో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశాన్ని సీఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ప్రజల నమ్మకాన్ని పొందాం
మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి

రూ.100 కోట్ల డిపాజిట్లను సేకరించాం

రూ.4,300 కోట్ల వ్యాపారం చేశాం

కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

కర్నూలు అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య బ్యాంకుల కంటే దీటుగా ప్రజల నమ్మకాన్ని పొందామని కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కే.పార్చూన్‌ ఫంక్షన్‌ హాలులో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశాన్ని సీఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు పాల్గొన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌, కర్నూలు, నంద్యాల జిల్లాల సహకార అధికారులు వెంకటకృష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు. విష్ణువర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, రైతుల నుంచి నూతన డిపాజిట్‌ పథకాల ద్వారా ఈఏడాది రూ.100కోట్లకు పైగా డిపాజిట్లను సేక రించామని, వివిధ రకాల రుణాలను అమలుచేసి ఈ సంవత్సరం రూ.4,300 కోట్ల వ్యాపా రాన్ని విస్తరించామన్నారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామ కాలను పరిష్కరించి నంద్యాల జిల్లాలోని పీర్‌సాబ్‌ పేట, వెలుగోడు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, కృష్ణగిరి సహకార సంఘాల్లో చనిపోయిన ఉద్యోగుల వారసులకు నియామక పత్రాలు అందిస్తున్నామని ప్రకటించారు. ఆప్కాబ్‌ జనరల్‌ మేనేజర్‌ దినేష్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లాలోని సంఘాల అధ్యక్షులు, సీఈవోలు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:31 AM