Share News

రెండో శనివారం మేం పని చేయం

ABN , Publish Date - May 09 , 2026 | 10:45 PM

ప్రతి రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. ఇది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రా లకు వర్తించదు.

రెండో శనివారం మేం పని చేయం
జలదుర్గం ఆసుపత్రి

విధులకు డుమ్మాకొట్టిన వైద్యులు

ఇబ్బందులకు గురైన రోగులు

ప్యాపిలి, మే 9 (ఆంధ్రజ్యోతి) : ప్రతి రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. ఇది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రా లకు వర్తించదు. అయితే ఈ ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్లు మాత్రం ఆ రోజు పని చేయరు. రెండో శనివారం వాళ్ల సొంత సెలవు దినం. వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని జలదుర్గం గ్రామం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నారు. శనివారం ఆ ఇద్దరూ విధులకు డుమ్మాకొట్టారు. మిగతా సిబ్బంది మాత్రలు మాత్రమే ఇస్తామని, వైద్య పరీక్షలు చేయించు కోవలంటే డాక్టర్లు ఉన్న సమయంలో రావాలని చెప్పినట్లు రోగు లు తెలిపారు. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చిన రోగులు మధ్యాహ్నం 1గంట వరకు చూసి వైద్యులు రాకపోవడంతో సిబ్బంది ఇచ్చిన మాత్రలు తీసుకొని వెనుతిరిగి వెళ్లారు. విధులకు గైర్హాజరయిన డాక్టర్‌ సుల్తానను వివరణ కోరగా రెండో శనివారం అయినందున రాలేదన్నారు. సిబ్బందితో మాట్లాడి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చూస్తామన్నారు.

Updated Date - May 09 , 2026 | 10:45 PM