అన్నం పెట్టని వార్డెన్ మాకొద్దు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:19 PM
హాస్టల్‌లో తమకు భోజనం వడ్డించడం లేదని ఆదివారం పట్టణంలోని ఎమ్మిగనూరు సర్కిల్‌లో ఉన్న ఎస్సీ బాలుర నంబర్-1 వసతిగృహం విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు హాస్టల్ విద్యార్థుల బైఠాయింపు
ఆదోని అగ్రిలక్చర్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో తమకు భోజనం వడ్డించడం లేదని ఆదివారం పట్టణంలోని ఎమ్మిగనూరు సర్కిల్‌లో ఉన్న ఎస్సీ బాలుర నంబర్-1 వసతిగృహం విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వారికి ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మద్దతు తెలిపి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అన్నం పెట్టలేని వార్డెన్ తమకు వద్దని, వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. నాణ్యమైన పౌష్టికాహారం సక్రమంగా వడ్డించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్‌లో సరుకులు పక్కదారి పడుతున్నాయని, దీనిపై విచారణ చేపట్టి వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ పట్టణాధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్, డీవైఎ్‌ఫఐ పట్టణ కార్యదర్శి మోహన్, వెంకటేష్, జగన్, ఉత్తేజ్ పాల్గొన్నారు.