సుపరిపాలన అందించాం
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:36 PM
రెండేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఇంటింటికి వెళ్లి వివరించిన మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం నగరంలోని 3వ వార్డులో సాగు మండి వీధీలో ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజలను కలిసి అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తామంతా ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగ అవకా శాలు కల్పించేందుకు దేశ, విదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు. కర్నూలుకు సైతం ఇప్పటికే రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలో రిలయన్స్ కంపెనీ ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే ఉన్న జైరామ్ స్టీల్ కంపెనీలలో మరో రూ. 6 కోట్లతో కంపెనీని విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నగరంలోని వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ నాయకులు ఆరాచకాలకు పాల్పడటం తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడం లేదన్నారు. టీడీపీ నాయకులు, బూత్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.